తొలిసారి ఇద్దరికి బుకర్ ప్రైజ్
కెనడియన్ రచయిత మార్గరెట్ ఎట్ వుడ్, ఆంగ్లో నైజీరియన్ రచయిత ఎవరిస్టోలకు బుకర్ బహుమతి లభించింది.
బూకర్ ప్రైజ్-2019 ఈసారి ఇద్దరికి వరించింది. మార్గరెట్ ఆట్‌వుడ్, బెర్నార్డినీ ఎవరిస్టోలకు ఆంగ్ల సాహిత్య రచయితలకు ప్రైజ్ పంచుకున్నారు. లండన్ లో జరిగిన ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి ఈ అవార్డును అందుకున్నారు. ఫిక్షన్ కేటగిరిలో తొలిసారి ఇద్దరికి బూకర్ ప్రైజ్ ప్రకటించడం విశేషం.
కెనడియన్ రచయిత మార్గరెట్ ఎట్ వుడ్, ఆంగ్లో నైజీరియన్ రచయిత ఎవరిస్టోలకు బుకర్ బహుమతి లభించింది. ఎట్‌వుడ్‌కు బుకర్ పురస్కారం లభించడం ఇది రెండోసారి. టెస్టమెంట్స్ అనే రచనకు మార్గరెట్‌కు , గర్ల్ ఉమన్, అదర్ రచనకు బెర్నర్ డైన్ ఎవరిస్టో ఈ బుకర్ బహుమతి లభించింది. ఈ ప్రైజ్ మనీ 50వేల పౌండ్లు ఇద్దరికి ఇచ్చారు. బుకర్ ప్రైజ్ నిబంధనలకు విరుద్ధంగా జడ్జీలు ఇద్దరి అవార్డు ప్రకటించడం గమనార్హం. అయితే 1992లో ఇద్దరు వ్యక్తులకు ఈ అవార్డు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఈ అవార్డు అందుకున్న తొలి నల్లజాతి మహిళగా బెర్నర్ డైన్ నిలిచారు.