ప్రపంచంలో టాప్ అవినీతి దేశాల లిస్ట్: భారత్ స్థానం ఎంతో తెలుసా?

Corrupt Country: అవినీతిలో భారత్ 96వ స్థానంలో నిలిచింది. 2023 ర్యాంకింగ్ తో పోలిస్తే 2024 నాటికి ఇండియా మూడు స్థానాలు పడిపోయింది.

Update: 2025-02-13 06:42 GMT

ప్రపంచంలో టాప్ అవినీతి దేశాల లిస్ట్: భారత్ స్థానం ఎంతో తెలుసా?

List Of Worlds Most Corrupt Country

Corrupt Country: అవినీతిలో భారత్ 96వ స్థానంలో నిలిచింది. 2023 ర్యాంకింగ్ తో పోలిస్తే 2024 నాటికి ఇండియా మూడు స్థానాలు పడిపోయింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ 2024 కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ సీపీఐ నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోని 100 అత్యంత అవినీతి దేశాల్లో భారత్ స్థానం దక్కించుకొంది.

పొరుగునే ఉన్న పాకిస్తాన్, చైనా అవినీతిలో ఏ స్థానంలో ఉన్నాయో చూద్దాం. పాకిస్తాన్ కు 27 పాయింట్లు దక్కాయి. ఆ దేశం 135వ స్థానం దక్కింది. ఇక చైనా 43 పాయింట్లు వచ్చాయి. ఆ దేశం 76వ ర్యాంక్ వచ్చింది.

ప్రభుత్వరంగంలో అవినీతిపై సీపీఐ సర్వే చేస్తోంది. సున్నా నుంచి 100 శాతం వరకు అవినీతిపై ఈ సంస్థ ర్యాంకింగ్స్ ఇస్తోంది. ఇందులో భారత్ కు 2024లో 38వ ర్యాంకు దక్కింది. 2023లో ఇది 39గా ఉంది. అంతకుముందు ఏడాది 2022లో 40వ ర్యాంకు ఉంది. ప్రపంచంలోని 180 దేశాల్లో డెన్మార్క్ 90 పాయింట్లతో టాప్ లో నిలిచింది. ప్రభుత్వ సెక్టార్ లో అతి తక్కువ అవినీతి ఉందని ఈ సంస్థ తేల్చింది.

ఆ తర్వాత ఫిన్లాండ్ కు పాయింట్లతో రెండో స్థానం దక్కింది. మూడో స్థానంలో సింగపూర్ నిలిచింది. ఆ దేశానికి 84వ పాయింట్లు వచ్చాయి. ఇక 83 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో నిలిచింది. నార్వే, స్విట్జర్లాండ్ దేశాలు 81 పాయింట్లతో ఐదో ప్లేస్ లో నిలిచాయి. స్వీడన్, నెదర్లాండ్స్ 78 పాయింట్లతో 8, 9 స్థానాల్లో నిలిచాయి. అస్ట్రేలియా, ఐర్లాండ్ 77 పాయింట్లతో 10వ ప్లేస్ కు చేరాయి.

2012 నుంచి 32 దేశాలు తమ అవినీతిని తగ్గించుకొన్నయి. మరో వైపు 148 దేశాలు అవినీతి ర్యాంకులు అధ్వాన్నంగా ఉన్నాయి. అవినీతిపై ప్రపంచ సగటు 43 శాతంగా ఉంది.మూడింట రెండొంతుల దేశాల స్కోర్ 50 కంటే తక్కువగా ఉన్నాయని సీపీఐ నివేదిక బయటపెట్టింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రతి దేశం చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక సూచిస్తోంది. అవినీతి అవగాహన సూచికలో వెల్లడై ప్రమాదకరమైన పోకడలు అవినీతిని ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని నివేదిక కోరుతోంది.

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన నిధులు అవినీతి కారణంగా దుర్వినియోగమౌతున్నాయని ఈ నివేదిక బయటపెట్టింది. మితిమీరిన అవినీతి పరోక్షంగా పర్యావరాణానికి కూడా నష్టం చేస్తోంది.ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వరంగంలో పెరుగుతున్న అవినీతి, అవినీతిని ప్రోత్సహించే నిబంధనలను అమలు చేయడం వంటి అంశాల ఆధారంగా అవినీతిపై ఆయా దేశాల్లో అవినీతి స్కోర్ ను లెక్కిస్తారు.

Tags:    

Similar News