Haryana: INLD హర్యానా చీఫ్‌ కారుపై 50 రౌండ్ల కాల్పులు.. నఫే సింగ్‌‌తో పాటు మరో వ్యక్తి మృతి

Haryana: బహదూర్‌ఘర్‌లో 50 రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు

Update: 2024-02-26 06:21 GMT

Haryana: INLD హర్యానా చీఫ్‌ కారుపై 50 రౌండ్ల కాల్పులు.. నఫే సింగ్‌‌తో పాటు మరో వ్యక్తి మృతి

Haryana: INLD హర్యానా యూనిట్ అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీని కాల్చి చంపారు. ఝజ్జర్ జిల్లాలోని బహదూర్‌ఘర్‌లో రాఠీ కారును లక్ష్యంగా చేసుకుని 40 నుంచి 50 రౌండ్ల కాల్పులు జరిపారు. దాడి తర్వాత, తీవ్రంగా గాయపడిన రాఠీని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఈ కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యే సెక్యూరిటీ గార్డు కూడా చనిపోయాడు. మరో ఇద్దరు పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

Tags:    

Similar News