Gen Z Protests In Nepal: నేపాల్ రణరంగం

నేపాల్‌లో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. అవినీతి వ్యతిరేకంగా "Gen-Z" ఉద్యమం పేరిట కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వందమందికి పైగా గాయపడ్డారు.

Update: 2025-09-08 11:17 GMT

Gen Z Protests In Nepal: నేపాల్ రణరంగం

నేపాల్‌లో పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారాయి. అవినీతి వ్యతిరేకంగా "Gen-Z" ఉద్యమం పేరిట కొనసాగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వందమందికి పైగా గాయపడ్డారు.

ఉధృతమైన నిరసనల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ సహా 26 సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం విధించింది. నిరసనకారులు ఖాట్మండు పార్లమెంట్‌లోకి దూసుకెళ్లడం పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేసింది.

అందోళనకారులను అదుపులోకి తేవడానికి భద్రతా దళాలు కాల్పులు జరపగా, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆర్మీని రంగంలోకి దింపింది ప్రభుత్వం.

ప్రస్తుతం ఈ నిరసనలు ఖాట్మండు మాత్రమే కాకుండా పొఖారా, భరత్‌పూర్ వంటి ప్రధాన నగరాలకు విస్తరించాయి. దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News