ఆడ బాతుకు స్వయంవరం

పూర్వం రాజుల కాలంలో తమ కుమార్తెలకు పెళ్లి జరిపించడానికి స్వయం వరం ప్రకటించేవారు.

Update: 2019-12-15 08:44 GMT

పూర్వం రాజుల కాలంలో తమ కుమార్తెలకు పెళ్లి జరిపించడానికి స్వయం వరం ప్రకటించేవారు. ఆ స్వయం వరంలో ఎవరైతే ఉత్తమ ప్రతిభకనబరుస్తారో వారికే తమ కుమార్తెని ఇచ్చి వివాహం చేసేవారు. ఇప్పటి వరకు కూడా కొన్ని దేశాల్లో ఈ స్వయం వరం కొనసాగుతూనే ఉంది. మనుషులకు స్వయం జరగడం సాధారణమైన విషయమే కానీ ఇటీవల ఓ వ్యక్తి తన బాతుకు కూడా స్వయం వరం ప్రకటించాడు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. బాతుకు స్వయం వరం ఏంటా అనుకుంటున్నారు కదూ..

మరి ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా.. అమెరికాలోని బ్లూ హిల్స్ ప్రాంతంలో నివసించే మారిస్ ఈ ఆసక్తి కరమైన వార్తను తెలియజేసాడు. మారిస్ కొన్ని రోజులుగా బాతులను పెంచుకుంటున్నాడు. సడంగా ఒక రోజు ఒక ఆడబాతు మినహా మిగిలిన బాతులన్నీ చనిపోయాయి. దాంతో ఆ ఆడ బాతు ఒంటరిగా మిగిలిపోయింది. అప్పటి నుంచి ఆ బాతు దిగాలుగా ఉండడం గమనించాడు దాని యజమాని. తనకు ఒక మంచి జోడీని వెతకాలనుకున్నాడు. తాను పెంచుకుంటున్న ఆడబాతుకు స్వయం వరం ప్రకటిస్తూ బాతు ఫోటోతో ఉన్న పోస్లర్లను వీధి వెంట అతికించారు. అంతే కాదు దాంట్లో అతనికి సంబంధించి ఈమెయిల్ అడ్రస్ ను కూడా రాశాడు.

మగబాతును పెంచుకుంటున్నవారు ఆదివారం పూట తన ఇంటికి బాతుతో కలిసి స్వయం వరానికి రావాలని కోరారు. ఈ ప్రకటనను చూసిన కొందరు ఇప్పటికే స్పించారు. వారు పెంచుకుంటున్న మగబాతును తీసుకొని ఆయన ఇంటికి వెళ్లడం ప్రారంభించారు. ఇక స్వయం వరానికి వచ్చిన బాతులకు ఎలాంటి పరీక్షలు పెడతారో చూడాలి. ఏ మగ బాతు ఆడ బాతును స్వయం వరంలో గెలుచుకుంటుందో వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News