Donald Trump: ట్రంప్ ఇంట్లోకి చొర‌బ‌డేందుకు య‌త్నించిన యువ‌కుడు.. విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యం

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసమైన మార్-ఎ-లాగోలో గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఉద్దేశ్యం తెలిసిన అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

Update: 2025-06-04 06:56 GMT

 Trump: అమెరికా అధ్యక్షుడి సంచలన నిర్ణయం.. ఆ 12 దేశాలపై నిషేధం..!!

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసమైన మార్-ఎ-లాగోలో గోడ దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఉద్దేశ్యం తెలిసిన అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

23 ఏళ్ల ఆంథోనీ థామస్ అనే యువకుడు మంగళవారం మార్-ఎ-లాగో పరిసరాల్లో చొరబడేందుకు ప్రయత్నించాడు. గోడ దూకుతుండగా భద్రతా సిబ్బంది అతడిని వెంటనే పట్టుకున్నారు. విచారణ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన అధికారులను ఆశ్చర్యపరిచింది. ‘‘ట్రంప్‌కు ఓ మంచి వార్త చెప్పాలి. ఆయన మనవరాలు కై ట్రంప్‌ను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని థామస్ వెల్లడించాడు.

అయితే ఇది మొదటిసారి కాదని అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లోనూ థామస్ ఇలాగే ట్రంప్ ఇంటి దగ్గరకి వచ్చినట్లు గుర్తించారు. తాజా ఘటన జరిగిన సమయంలో ట్రంప్ వాషింగ్టన్‌లో ఉన్నారని, ఈ విషయం ఆయనకు తెలియజేశామని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం థామస్‌ను పామ్ బీచ్‌ ప్రాంతంలోని జైలుకు తరలించినట్టు సమాచారం.

మార్-ఎ-లాగో ప్రాంగణం గట్టి భద్రత మధ్య ఉంటుంది. ట్రంప్‌పై గతంలో హత్యాయత్నాలు జరిగిన నేపథ్యంలో అక్కడి భద్రత మరింత కఠినతరం చేశారు. ఈ ప్రాంతంలో సాధారణ ప్రజలను అనుమతించరు. అయినా కూడా భద్రతా ఏర్పాట్ల మధ్య ఇలా చొరబడే ప్రయత్నాలు జరగడం అధికారులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News