Coronavirus: 80 దాటితే వారి ఖర్మకి అలా వదిలేయడమే! ఇటలీలో దయానీయ పరిస్థితి!

Update: 2020-03-16 03:56 GMT
a medical camp in Italy (image source: The telegraph)

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చోట్టేస్తోంది. అసలు కరోనా చైనాలో పుట్టినా ప్రస్తుతం అక్కడ పరిస్థితులు కాస్త అదుపులోకి వచ్చాయి. అయితే, ఇటలీ దేశంలో మాత్రం పరస్థితి దయానీయంగా మారిపోయిండానే వార్తలు వస్తున్నాయి. ఎంత దారుణంగా అంటే.. కరోనా సోకినా వ్యక్తి 80 ఏళ్ళు దాటినా వారైతే వారి ఖర్మాన వారిని వదిలివేసేన్తగా. మానవీయతకు మచ్చగా మారిపోతున్న సంఘటన ఇది. కానీ, ఇటలీ దేశం కోణంలో చూస్తె ఏమీ చేయలేని పరిస్థితి. 

ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ఇటలీలో కరోన అదుపు చేయడం తలకు మించిన భారంగా ఆ దేశ ప్రభుత్వానికి మారిపోయిందట. ఇటలీ అంటే అత్యున్నత జీవిన ప్రమాణాలకు విలువనిచ్చే దేశంగా పేరుపొందింది. కానీ, ఈ కరోనా వ్యాధి వ్యాపిస్తుండడంతో అక్కడ  వనరులు సరిపోక వచ్చే వ్యాధి గ్రస్తులకు కావలసిన ఏర్పాట్లు చేయలేక వైద్య అధికారులు సతమతమైపోతున్నారట ఇటలీలో. పూర్తిగా అక్కడి పరస్థితి అదుపు తప్పిపోయింది. ఒక ప్రాంతంలో అయితే, మరింత దారుణంగా మారిపోయింది. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరీ తక్కువగా ఉన్నాయి. టెంట్లు వేసి వైద్య సహాయం అందిస్తున్నారు. కానీ, అవి కూడా చాలడం లేదు. డాక్టర్లు సరిపడా లేరు. 14 రోజుల పాటు రోగులను ఐసీయూలో ఉంచాల్సి ఉంది. ఈ లోపు కొత్త కేసులు వచ్చి పడుతున్నాయి. మరణాలు అదేవిధంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కోవడం ఇటలీలో చలా సమస్యాత్మకంగా మారిందని తెలుస్తోంది.

ఇక ఇటలీలోని ఓ ప్రాంతంలో ఏమీ చేయలేక అక్కడి స్థానిక అధికారులు కరోనా వ్యాధి గ్రస్తుల కోసం కోసం ఒక ప్రోటోకాల్ సిద్ధం చేశారంట. మూడు కేటగిరీలుగా వ్యాధి గ్రస్తులను విభజించే పధ్ధతి అక్కడి డిజాస్టర్ మేనేజిమెంట్ చేసిందట. దాని ప్రకారామ్ 80 ఏళ్ళు దాటినా వృద్ధులు మొదటి కేటగిరీలోకి వస్తారు. రెండో కేటగిరీలోకి దీర్ఘకాల వ్యాధులు ఉన్నవాళ్లు వస్తారు. ఇక మూడో క్యాటగిరీ లోకి మిగిలిన వారు వస్తారు. దీనిలో మొదటి క్యాటగిరీ అయిన 80 ఏళ్ళు దాటినా వ్రుద్దులక్కు కరోనా పాజిటివ్ అని తేలినా వారికి వైద్యసహాయం అందించే అవకాశం ఉండదు. కచ్చితంగా కరోనా పాజిటివ్ అని తెలిసిన వ్యక్తీ 80 ఏళ్లకు తక్కువ వయసు ఉన్నవాడి ఉండాలి.. అదీకూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయి ఉండకూడదు. ఇదే అక్కడి రూల్.

కరోనా సోకిన వారిలో మరణాలు 80 ఏళ్లకు పైబడిన వారికే ఎక్కువ. ఇక వారికి వైద్యం చేసీ ఉపయోగం లేదన్నది అక్కడి అధికారుల భావనగా కనిపిస్తోంది. 80 ఎల్లా వయసుండీ, దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవారికి కరోనాతో మరణమే శరణ్యం. వారిని రక్షించే అవకాశం దాదాపు శూన్యం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు.

ఈ కథనం తో ఇటలీ లో నెలకొన్న దయానీయ పరిస్థితులు తెలుస్తున్నాయి. మాన్వత్వాన్నికి కొత్త సవాలు విసురుతున్న కరోనా వ్యాధి తీవ్రతను కళ్ళకు కట్టినట్టు ఇది తెలియచేస్తోంది. టెలిగ్రాఫ్ ప్రచురించిన ఆ కథనాన్ని ఈ క్రింది లింక్ ద్వారా మీరూ తెలుసుకోండి.

టెలిగ్రాఫ్ పత్రికలో వచ్చిన కథనం ఇదే 

Tags:    

Similar News