జుకర్‌బర్గ్ ను పట్టిస్తే 22 కోట్ల బహుమానం: కొలంబియా పోలీసుల ప్రకటన

Mark Zuckerberg:మార్క్ జుకర్‌బర్గ్ ఈ పేరు తెలియని వారు ఉన్నా ఫేస్ బుక్ తెలియని వారు మాత్రం ఉండరు

Update: 2021-07-04 12:54 GMT

మార్క్ జుకర్‌బర్గ్ ( ఫోటో : బిబిసి)  

Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ ఈ పేరు తెలియని వారు ఉన్నా ఫేస్ బుక్ తెలియని వారు మాత్రం ఉండరు అయితే ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ని పట్టిస్తే అక్షరాల 22 కోట్ల రూపాయలు బహుమతి ఇస్తామని కొలంబియా పోలీసులు ప్రకటించారు. అయితే ఇక్కడే మీకో అనుమానం రావోచ్చు జుకర్‌బర్గ్ కి కొలంబియా పోలీసులకి ఏంటి సంబంధం అని.. కొద్ది రోజుల క్రితం కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పై కాటాటంబో వద్ద కొంత మంది దుండగులు బుల్లెట్లతో దాడి చేసారు. ఈ దాడి సమయంలో అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ తో పాటు రక్షణ మంత్రి డియెగో మొలానో, అంతర్గత మంత్రి డేనియల్ పలాసియోస్ మరియు నార్టే డి శాంటాండర్ సిల్వానో కూడా ప్రయాణించారు.


అయితే ఆ దాడికి సంబందించిన విడుదల చేసిన ఇద్దరు నిందితుల స్కెచ్ లో ఒకరు మార్క్ జుకర్‌బర్గ్ ని పోలి ఉండటంతో ఆ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా, ఉగ్రవాదానికి మరియు వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం వలనే తనకి దాడులు జరిగాయని ఈ దాడులతో తాము బయపడేది లేదని కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ గతంలోనే ప్రకటన చేసాడు.

Tags:    

Similar News