Kohinoor Diamond: కోహినూర్ వజ్రం తిరిగి భారత్‌కు..? బ్రిటన్ సంచలన ప్రకటన!
Kohinoor Diamond: భారతీయులు బ్రిటన్‌లోని వారసత్వ ప్రదర్శనలను చూడగలగాలి, అదే విధంగా బ్రిటిష్ ప్రజలు భారత సంపదను అనుభవించగలగాలి అనే దిశగా ఈ సహకారం సాగనుంది.
Kohinoor Diamond: కోహినూర్ వజ్రం తిరిగి భారత్‌కు..? బ్రిటన్ సంచలన ప్రకటన!
Kohinoor Diamond: 108 క్యారెట్ల విలువైన కోహినూర్ వజ్రం తిరిగి భారత్‌కు ఇవ్వాలన్న డిమాండ్‌పై యూకే నుండి ఆసక్తికర స్పందన వచ్చింది. బ్రిటన్ సాంస్కృతిక, మీడియా మరియు క్రీడా శాఖ మంత్రి లీసా నాండి మాట్లాడుతూ, భారత్-బ్రిటన్ మధ్య వారసత్వ సంపదపై పరస్పర సహకారానికి సంబంధించిన చర్చలు సాగుతున్నాయని తెలిపారు.
1849లో మహారాజా దలీప్‌సింగ్ కోహినూర్‌ను బ్రిటన్ క్వీన్ విక్టోరియాకు అప్పగించారు. 1937లో ఈ వజ్రాన్ని క్వీన్ మదర్ తలపాగా కిరీటంగా ధరించారు. తాజాగా, న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా నాండి, భారతీయ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలసి రెండు దేశాల మధ్య సాంస్కృతిక సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం కింద క్రియేటివ్ ఇండస్ట్రీస్, వారసత్వ పరిరక్షణ, మ్యూజియం నిర్వహణ, డిజిటల్ మ్యూజియాల నిర్మాణం వంటి అంశాల్లో పరస్పర బంధాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్రిటిష్ కౌన్సిల్, బ్రిటిష్ మ్యూజియం, నాచురల్ హిస్టరీ మ్యూజియం, సైన్స్ మ్యూజియం గ్రూప్, విఎండ్‌ఎ మ్యూజియం లాంటి సంస్థలు ఈ సహకారంలో భాగం కానున్నాయి.
భారతీయులు బ్రిటన్‌లోని వారసత్వ ప్రదర్శనలను చూడగలగాలి, అదే విధంగా బ్రిటిష్ ప్రజలు భారత సంపదను అనుభవించగలగాలి అనే దిశగా ఈ సహకారం సాగనుంది. కోహినూర్‌పై నేరుగా నిర్ణయం ప్రకటించనప్పటికీ, బ్రిటన్ ఇటు పరస్పర కలసికొలిసి వ్యవహరించేందుకు సిద్ధంగా ఉందన్న సంకేతం ఇవ్వడం గమనార్హం.