మారణహోమం : మసీదులో బాంబు పేలుడు 28మంది మృతి

ఈ పేలుళ్లలో దాదాపు 28మంది మృతిచెందారు. మరో 50మందిపైగా గాయపడ్డారు. భారీ పేలుళ్ల ధాటికి మసీదు పై కప్పు కూలిపోయింది. ఐసిస్‌ల, తాలిబన్ల‌, ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగాయి.

Update: 2019-10-18 14:34 GMT

ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ మసీదులో ప్రార్థన సమయంలో ఒక్కసారిగా బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో దాదాపు 28మంది మృతిచెందారు. మరో 50మందిపైగా గాయపడ్డారు. భారీ పేలుళ్ల ధాటికి మసీదు పై కప్పు పూర్తిగా ధ్వంసమైంది. ఐసిస్‌ల, తాలిబన్ల‌, ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు బాధ్యులమంటూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకూ ప్రకటించలేదు.

ఈ పేలుళ్లలో గాయపడిన 58మంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాంబు దాడుల్లో 28మంది మృతిచెందినట్లుగా నంగార్‌ హర్‌‌ప్రావిన్స్‌ అధికార ప్రతినిధి అతుల్లా ఖొయానీ వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో దాడుల సంఖ్య పెరిగిందని ఐకాస ప్రకటించింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది బాంబు దాడులు 42 శాతం పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. దాడులను ప్రతినిధి ఐక్యరాజ్యసమితి యమామోటో ఖండించారు. ప్రజల ప్రాణాలు తీయడం సరైందికాదని సూచించారు.

Tags:    

Similar News