Blue Ghost Lander: చంద్రుడిపై దిగిన ప్రైవేట్ ల్యాండర్ బ్లూఘోస్ట్
Blue Ghost Lander: అమెరికాకు చెందిన ఫైర్‌ఫ్లై ఏరో స్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ వ్యోమనౌక చందమామపై ల్యాండ్ అయింది.
Blue Ghost Lander: అమెరికాకు చెందిన ఫైర్‌ఫ్లై ఏరో స్పేస్ సంస్థకు చెందిన బ్లూ ఘోస్ట్ వ్యోమనౌక చందమామపై ల్యాండ్ అయింది. జాబిల్లి ఈశాన్య భాగంలోని ఒక పురాతన అగ్నిపర్వత ప్రాంతంలో ఈ ఏరో స్పేస్ ల్యాండ్ అయిందని ఫైర్ ఫ్లై సంస్థకు చెందిన మిషన్ కంట్రోల్ కేంద్రం ధ్రువీకరించింది. 100 మీటర్ల మారే క్రిసియంలోనే వ్యోమనౌక దిగింది ఫైర్ ఫ్లై సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. మూన్ పై ల్యాండైన అరగంట తర్వాత ఫోటోలు పంపిందని వారు తెలిపారు.
బ్లూఘోస్ట్ వ్యోమనౌక చంద్రుడిపై నిటారుగా ల్యాండ్ అయింది. చంద్రుడిపై ల్యాండైన తొలి ప్రైవేట్ వ్యోమనౌకగా ఇది రికార్డు సృష్టించింది. చంద్రుడిపై మనుషులను పంపే ప్రయోగంలో భాగంగా ఈ వ్యోమనౌకను పంపారు. మూన్ పై ఉన్న భూమి నమూనాలను సేకరించేందుకుఒక వాక్యూమ్ , ఉపరితలం నుంచి మూడు మీటర్ల వరకు ఉష్ణోగ్రతలు కొలిచే సామర్ధ్యం ఉన్న డ్రిల్ ను ఇందులో ఉంది.
టెక్సాస్ కు చెందిన ఇంట్యూటివ్ మెషన్స్ సంస్థ ప్రయోగించిన ల్యాండర్ కూడా మార్చి 6న చంద్రుడిపై దిగే అవకాశం ఉంది.