సర్కస్ లో దారుణం... ట్రైనర్ పై ఎలుగుబంటి దాడి

సర్కస్ అంటే చాలు చాలా మంది అందులో జంతువులు చేసే విన్యాసాలు చూడటానికి వస్తుంటారు.

Update: 2019-10-26 06:05 GMT

సర్కస్ అంటే చాలు చాలా మంది అందులో జంతువులు చేసే విన్యాసాలు చూడటానికి వస్తుంటారు. కాని ఆ జంతువులకు శిక్షణ ఇచ్చేవాళ్ళ పరిస్థితి మాత్రం చాల దారుణంగా ఉంటుంది. ఆ జంతువులు ఏ క్షణాన వారిపైన దాడి చేస్తాయో కూడా తెలియని పరిస్థితి. రష్యాలో జరిగిన అలాంటి సంఘటనే ఇప్పుడు మనం చూడబోతున్నాం. దాదాపుగా 272 కిలోల బరువున్న ఒక ఎలుగుబంటి మనిషిలా రెండు కాళ్లపై నడుస్తూ, చిన్న బండిని తోసుకుంటూ సర్కస్‌ వేదిక పైకి వచ్చింది.

అది చేసే విన్యాసాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్క సారిగా ఏమైందో తెలిదు గాని సడంగా దాని ట్రైనర్‌ తలను, మెడను పట్టుకుని గుంజి కింద పడేసింది. అతన్ని అమాంతం నమిలేయబోయింది. దీంతో అక్కడే వున్న అతని సహాయకుడు దాన్ని కాళ్లతో తన్నుతూ అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. ఇంతకీ అది కదలకపోవడంతో మిగతా సిబ్బంది కుడా వచ్చి ఎలుగుబంటి నుంచి అతన్ని విడిపించారు. ప్రేక్షకుల కూర్చునే గ్యాలరీకి, వేదికకు మధ్య బారికేడ్లు లేకపోవడంతో ప్రేక్షకులంతా భయంతో సర్కస్‌ నుంచి బయటకు పరుగులు తీసారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Full View

 

Tags:    

Similar News