గతుకుల రోడ్డు బాగు చేయలేదని మేయర్ ను రోడ్డున పడేసి ఈడ్చేశారు!

మన ఊరిలో రోడ్లు బాగోకపోతే మనమేం చేస్తాం.. ఆ రోడ్డున వెళ్లే ప్రతిసారీ మనల్ని మనం తిట్టుకుంటాం. ఇంకా కాకపోతే, నాయకుల్ని మనసులోనే తిట్టుకుంటాం. పైకి తిట్టడం కాదు కదా..ఆ నాయకుడు అక్కడే ఎదురుపడిన మాట్లాడే ధైర్యం కూడా చేయం.

Update: 2019-10-10 11:34 GMT

మన ఊరిలో రోడ్లు బాగోకపోతే మనమేం చేస్తాం.. ఆ రోడ్డున వెళ్లే ప్రతిసారీ మనల్ని మనం తిట్టుకుంటాం. ఇంకా కాకపోతే, నాయకుల్ని మనసులోనే తిట్టుకుంటాం. పైకి తిట్టడం కాదు కదా..ఆ నాయకుడు అక్కడే ఎదురుపడిన మాట్లాడే ధైర్యం కూడా చేయం. కానీ, మాక్సికోలో ఓ నాయకుడిని అక్కడి ప్రజలు ఏంచేశారో వింటే మీరు ఆమ్మో అనుకోవడం ఖాయం. కనీసం అడగడానికి భయపడే మనం అంత స్థాయి వ్యతిరేకతను ఊహించాను కూడా ఊహించలేం. హింసాత్మాకంగా వ్యవహరించాలని కాదు కానీ, ప్రజల్లో ఆవేశం పెల్లుబుకితే.. పాలకులపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఏంజరుగుతుందో చెప్పడం కోసమే ఈ కథనం మీకందిస్తున్నాం. 

మెక్సికోలో చియపాస్ రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రమాదాలకు గురవ్వుతున్న ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రోడ్లు బాగు చేయడం లేదనే కోపంతో విసిగిపోయారు. కొంతమంది ప్రజలు నేరుగా మేయర్‌నే నిలదీశారు. అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అతన్ని బలవంతంగా బయటకు లాక్కొని వచ్చి ట్రక్కుకు కట్టేశారు. అనంతరం నగర వీధుల్లో ఈడ్చుకెళ్తూ.. రోడ్ల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారు.

మెక్సికోలో చియపాస్ రాష్ట్రంలో లాస్ మార్గరీటాస్ నగరంలో మంగళవారం కొంతమంది వ్యక్తులు మున్సిపాలిటీ ఆఫీసులోకి చొరబడి, మేయర్ జార్జ్ లూయిస్ ఎస్కాండన్ హెర్నాండెజ్ చాంబర్‌లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. అతడిని బయటకు లాక్కొని వచ్చి, టయోటా ట్రక్కుకు కట్టేసి నగర వీధుల్లో ఈడ్చుకెళ్లారు. ఈ సందర్భంగా మేయర్ మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య పెద్ద గొడవే జరిగింది. ఒకరినొకరు కర్రలు, పైపులతో కొట్టుకున్నారు.

కాగా, ఈ మేయర్‌పై ప్రజలు దాడి చేయడం ఇదో రెండోసారి. నాలుగు నెలల కిందట కూడా హామీలు నెరవేర్చడం లేదనే కారణంతో మేయర్‌ను కొట్టారు. 'Tinta Fresca Chiapas', 'Tabasco AI Minuto' వార్తా వెబ్‌సైట్లు ట్విట్టర్‌లో ఈ వీడియోలను పోస్టు చేశాయి. నిరసనకారులు మేయర్ చేతులను తాళ్లతో కట్టేసి ట్రక్కుతో లాక్కెళ్లినట్లు మెక్సికో వార్తా పత్రికలు వెల్లడించాయి. పోలీసులు వారిని అడ్డుకుని మేయర్‌ను విడిపించారని పేర్కొన్నాయి. ఈ ఘటనలో 11 మందిని అరెస్టు చేశారు. వారిపై హత్యాయత్నం, అపహరణ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 




Tags:    

Similar News