Trump: అప్ఘానిస్తాన్ సంక్షోభ పరిస్థితులపై స్పందించిన మాజీ అధ్యక్షుడు ట్రంప్

Trump: ప్రస్తుత పరిస్థితులకు జోబైడెన్ కారణమంటూ ట్రంప్ ఫైర్ * ఇలాంటి పరిస్థితికి కారణమైన బైడెన్ రాజీనామా చేయాలని డిమాండ్

Update: 2021-08-17 02:08 GMT
బైడెన్ పై మండి పడ్డ డోనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఇమేజ్)

Trump: తాలిబన్ల ఆక్రమణతో అప్ఘానిస్తాన్‌లో నెలకొన్న ప్రస్తుత సంక్షోభ పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కారణమంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిప్పులు చెరిగారు. తాను అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని ఆయన అన్నారు. అప్ఘాన్‌లో ఇలాంటి పరిస్థితి కల్పనకు కారణమైనందుకు బైడెన్ రాజీనామా చేయాలంటూ ఫైర్ అయ్యారు. అమెరికా చరిత్రలోనే ఇది ఒక ఫెయిల్యూర్ అంటూ ట్రంప్ తీవ్ర వాఖ్యలు చేశారు. అప్ఘాన్ విషయంలో బైడెన్ చాలా గొప్ప పని చేశారంటూ తనదైన స్టైల్ లో ఎద్దేవా చేశారు. అప్ఘాన్ లో సంక్షోభ సమయంలో బైడెన్ వ్యవహరించిన తీరును ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. తాలిబిన్లపై చేస్తున్న యుద్ధంలపై ఖర్చు చాలా ఎక్కువ అవుతుండడంతో ఆప్ఘాన్ నుంచి అమెరికా సైన్యం వెనక్కు వచ్చే ప్రక్రియకు ట్రంప్ హయాంలోనే ఒప్పందం కుదిరింది. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 31 నాటికే ఆప్ఘాన్ నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తి కావాలని జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News