భారత్ అమెరికా మధ్య ఇంధన రంగంలో కీలక ఒప్పందాలు

Update: 2019-09-22 04:11 GMT

ఇంధనరంగానికి సంబంధించి అమెరికా ఇండియా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ వారం రోజుల అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఉదయం ఆయన 16 కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంధన ఱంగానికి సంబంధించి అమెరికా కు చెందిన టెల్లూరియన్ భారత్ కు చెందిన పెట్రోనాట్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాదికి 5 మిలియన్ టన్నుల సహజ వాయువు కొనుగోలుకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించిన ఇతర లావాదేవీలు 2020 మర్చి 31కి తేలుతాయి. ఈ సమావేశం విజయవంతం అయిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

కాసేపట్లో ప్రధాని హౌడీ-మోడీ కార్యక్రమం..

అమెరికాలోని హూస్టన్ లో ప్రధాని మోడీ హౌడీ-మోడీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సమావేశం మరి కొద్దీ సేపట్లో ప్రారంభం అవుతుంది.


Tags:    

Similar News