మొసలి బారి నుంచి తన చెల్లెలిని కాపాడిన 15 ఏళ్ల బాలుడు

Update: 2019-11-16 12:41 GMT

ఇప్పటి వరకూ సాహసబాలల కథలను మనం ఎన్నో వినే ఉంటాం. కానీ ఇప్పటి వరకూ మొసలితో పోరాడి బయట పడిన బాలల కథను మనం చూడలేదు. పెద్దవారికైనా, చిన్న వారికైనా మొసలి అంటేనే చాలా భయం వేస్తుంది. అది నోరు తెరిచి అమాంతం మనుషులను మింగుతుంది. అది తెలిసిన ఎవరూ కూడా దాని జోలికి కానీ, అది ఉన్న ప్రాంతానికి కానీ వెళ‌్లడానికే భయపడతారు. కానీ ఒక బాలుడు మాత్రం తన చెల్లెలెని మొసలి బారి నుంచి కాపాడాడు. మరి ఈ సాహసోపేతమైన సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా...

ఫిలిప్పైన్‌కు చెందిన హసీం(15) అనే బాలుడు తన చెల్లెలు హైనా లిసా జొసీ హబి(12) ఇద్దరూ అలా సరదాగా బయటకు వెళ్లాడు. ఈ క్రమంలోనే వారికి చేరువలోనే ఉన్న బాంబో వంతెనను దాటవలసి వచ్చింది. ముందుగా హసీం వంతెనను దాటి ముందుకెళ్లి తన చెల్లెసి కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో హైనా లిసా జొసీ హబి కూడా అతడి వెనకాలే వంతెనను దాటుతుంది. అంతలోనే ఒక్క సారిగా ఏదో తన కాలును పట్టుకుని కిందకి లాగినట్లు అనిపించడంతో వంతెనను పట్టుకుని లోపలికి లాగడం మొదలు పెట్టింది. దీంతో భయపడిన బాలిక అన్నయా కాపాడు అంటూ బిగ్గరగా అరవడం మొదలు పెట్టింది. అది గమనించిన ఆమె అన్న హసీం నది ఒడ్డునుంచి మొసలిపై రాళ్లు విసరడం మొదలు పెట్టాడు. మొసలికి గట్టిగా దెబ్బలు తగలడంతో మొసలి ఆ అమ్మాయిన విడిచి నదిలోకి వెళ్లిపోయింది. ఈ విషయం గురించి తెలుసుకున్న స్థానికులు అతన్ని శభాష్ అని పొగడడం మొదలు పెట్టారు.

తన ప్రాణాలను కాపాడినందుకు ' ఐ లవ్‌ హిమ్‌ సో మచ్‌' అంటూ సోదరుడిపై ప్రేమ కురిపించింది. కాగా ఈ ఘటనలో హైనా కాలు లోపలికి మొసలి పళ్లు దిగి గాయమైంది. దీంతో బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.



Tags:    

Similar News