శాంతియుత చర్చలతోనే సమస్యల పరిష్కారం : తాలిబన్ల ప్రతినిధి మహ్మద్‌ షాహీన్‌

శాంతియుత చర్చలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తాలిబన్ల ప్రతినిధి మహ్మద్‌ సుహైల్‌ షాహీన్‌ పేర్కొన్నాడు. అన్ని దేశాలతో స్నేహాన్ని మాత్రమే తాము కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Update: 2019-10-15 07:09 GMT

శాంతియుత చర్చలతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తాలిబన్ల ప్రతినిధి మహ్మద్‌ సుహైల్‌ షాహీన్‌ పేర్కొన్నాడు. అన్ని దేశాలతో స్నేహాన్ని మాత్రమే తాము కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఓ ప్రముఖ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహ్మద్‌ సుహైల్‌ షాహీన్‌ మాట్లాడాడు. అఫ్గానిస్థాన్ సమస్యకు అమెరికా వద్ద పరిష్కార మార్గం ఉంటే శాంతి ఒప్పందానికి సిద్ధమని తెలిపాడు. అమెరికా సైనికుడిని చంపామని అంటోన్న ట్రంప్ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆరోపించాడు. అమెరికా సైన్యం తమపై దాడి చేసిందని దానిని తిప్పికొట్టామని పేర్కొన్నాడు. కాబూల్‌ పాలనలో జోక్యం తాము చేసుకొవడం లేదని స్పష్టం చేశాడు.

పాకిస్తాన్‌ జోక్యం చేసుకుంటేనే అఫ్గాన్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ చేసిన వ్యాఖ‌్యలపై షాహీన్‌ స్పదించాడు. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించాడు. ఏ ఒకరితో వైరం పెంచుకునే తరహాలోనూ వ్యవహారించడం లేదని పేర్కొన్నాడు. భారత్‌లో తాలిబన్లు దాడులు ప్రచారం మాత్రమే, తాము ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేదు.

దేశ అభివృద్ధికి తాము అంకితం అవుతామన్నాడు. భారత్‌ సహాయం కూడా తమకు అవసరమని సుహైల్‌ వ్యాఖ్యానించాడు. అమెరికాతో చర్చలు సఫలమైతే అమెరికా సైన్యం మాపై మరోసారి కాల్పులకు జరపొచ్చు. అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్లిన తర్వాత దాని మిత్ర దేశాలపై ఎలాంటి వ్యతిరేక చర్యలకు పాల్పడమని తాలిబన్ల అధికార ప్రతినిధి మహ్మద్‌ సుహైల్‌ షాహీన్‌ పేర్కొన్నాడు. 

Tags:    

Similar News