Agriculture: ప్రభుత్వం ఈ 2 పురుగుమందులను నిషేధించింది.. ఎందుకంటే..?

Agriculture: ఒకప్పుడు వ్యవసాయానికి సేంద్రియ ఎరువులు వాడేవారు. కాలక్రమేణా పంట దిగుబడి కోసం రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులను వాడటం ప్రారంభించారు.

Update: 2021-12-22 15:30 GMT

Agriculture: ప్రభుత్వం ఈ 2 పురుగుమందులను నిషేధించింది.. ఎందుకంటే..?

Agriculture: ఒకప్పుడు వ్యవసాయానికి సేంద్రియ ఎరువులు వాడేవారు. కాలక్రమేణా పంట దిగుబడి కోసం రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులను వాడటం ప్రారంభించారు. దీనివల్ల పంట దిగుబడి పెరిగి రైతులకు ఆదాయం పెరిగింది కానీ వీటివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ విపరీతంగా ఉంటున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. కూరగాయలు, పండ్లు, ధాన్యం, గింజలు మొదలగువాటిపై పురుగుమందుల అవశేషాలు ఉండటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అందుకే ప్రభుత్తం అత్యంత హానిచేసే పురుగుమందులను నిషేదిస్తూ వస్తుంది. తాజాగా రెండు పురుగుమందులపై ప్రభుత్వం నిషేధం విధించింది.

మీడియా నివేదికల ప్రకారం.. అవి ఒకటి స్ట్రెప్టోమైసిన్ రెండోది టెరాసైక్లిన్. టమాటా, యాపిల్ పంటలను చీడపీడల బారి నుంచి కాపాడేందుకు వీటిని ఉపయోగిస్తారు. 2024 తర్వాత భారతీయ కంపెనీలు ఈ రెండు పురుగుమందులను విక్రయించలేవు. ఈ రెండు రసాయనాలు పంటల ఇన్ఫెక్షన్‌ను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కానీ అవి వినియోగదారుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రమాదకరంగా మారుతున్న 27 క్రిమిసంహారక మందులను కేంద్ర ప్రభుత్వం గతంలో నిషేధించింది. అయితే లాబీ ఒత్తిడితో ఇప్పటి వరకు ఈ నిర్ణయం అమలు కాలేదు.

2022 ఫిబ్రవరి 1 నుంచి స్ట్రెప్టోమైసిన్, టెరాసైక్లిన్ అనే క్రిమిసంహారక మందుల దిగుమతి, ఉత్పత్తిపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. కంపెనీలు పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి సమయం కేటాయించారు. ఈ రెండింటితో వ్యాపారం చేస్తున్న కంపెనీలు జనవరి 31, 2022 వరకు వాటి నుంచి తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించగలవు. ఈ రెండు రసాయనాలను 2020లో నిషేధించాలని కేంద్ర క్రిమిసంహారక బోర్డు ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. వీటిని ఎక్కువగా వినియోగించే పండ్లు, కూరగాయలైన టమాటా, యాపిల్ వంటి వాటి వినియోగం మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని బోర్డు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News