Tomato: తగ్గిన టమాట ధర.. ఆందోళనలో అన్నదాత

Tomato: కూలీ ఖర్చు కూడా గిట్టుబాటు కాదంటున్న రైతులు

Update: 2023-01-09 02:37 GMT

Tomato: తగ్గిన టమాట ధర.. ఆందోళనలో అన్నదాత

Tomato: టమాటా పంట రైతును కష్టాల పాలు చేస్తోంది. ఒకప్పుడు కేజీ యాభై నుంచి వంద రూపాయల వరకు పలికిన టమాటా ధరలు.. ప్రస్తుతం భారీగా పతనమయ్యాయి. కేజీ టమాటా ధర కనీసం పది రూపాయలు కూడా పలుకక పోవడంతో రైతులు, వ్యాపారులు లబోదిబోమంటున్నారు. మరోవైపు టమాటా ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, కొనుగోలు సరిగా లేకపోవడంతో టమాటా వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

గతంలో వినియోదారులకు చుక్కలు చూపించిన టామాట ధరలు, ఇప్పుడు అమాంతంగా కిందకు పడిపోయాయి. మార్కెట్లో కూరగాయల రేట్లు తగ్గు ముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. పెద్దమొత్తంలో రైతులు సాగు చేసిన పంట ఇప్పుడు ఓకేసారి మార్కెట్ కు రావడంతో రేట్లు పడిపోయాయని వ్యాపారస్తులు, కొనుగోలు దారులు చెబుతున్నారు. టమాట ధరలు తగ్గడంతో చిరు వ్యాపారులు, రైతులు ఆందోళన చెబుతున్నారు.

రైతుల బజార్లకు వచ్చే కొనుగోలు దారులు కూడా తగ్గిపోతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో టమాట ధర తగ్గడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News