IITs Quash Basic Requirement : ఐఐటీల్లో ప్రవేశాలకు 75 శాతం మార్కుల నిబంధన ఎత్తివేత..

IITs Quash Basic Requirement: లక్షలాది మంది విద్యార్దులు తాము భవిష్యత్తులో బంగారు బాటలో నడిచేందకే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

Update: 2020-07-20 05:15 GMT
IITs Quash Basic Requirement

IITs Quash Basic Requirement: లక్షలాది మంది విద్యార్దులు తాము భవిష్యత్తులో బంగారు బాటలో నడిచేందకే ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ముఖ్యంగా ఐఐటీ లాంటి మంచి కోర్సుల్లో చేరాలనుకుంటారు. అందులో సీట్ వస్తే చాలు జీవితంలో పెద్ద విజయం సాధించారనుకుంటారు. అందులో సీట్ సంపాదించడం కోసం ఇంటర్‌ ప్రారంభం నుంచే సన్నద్ధమవుతుంటారు. రాత్రిపగలు చదువుతూ, రకరకాల కోచింగ్‌లు తీసుకుంటూ ఎంతో కష్టపడుతుంటారు. జేఈఈకి ప్రిపేరవుతుంటారు. ఇప్పటి వరకు ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈలో ర్యాంకుతో పాటు ఇంటర్‌లో 75 శాతం మార్కులు వస్తేనే అనే నిబంధన ఉండేది.

కానీ ఇప్పుడు ఈ నిబంధనలను విద్యావాఖ ఎత్తేయాలని తాజాగా జరిగిన సమావేశంలో ఐఐటీలు, జేఏబీ నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించిన క్వాలిఫైడ్‌ అభ్యర్థులు వారి మార్కులతో నిమిత్తం లేకుండానే ఐఐటీ ప్రవేశాలకు అర్హత పొందుతారని తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఐఐటీ ప్రవేశ ప్రక్రియలో సడలింపులు ఇస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇంటర్‌లో 75 శాతం మార్కులు లేదా ఆ రాష్ట్ర బోర్డులో మొదటి 20 పర్సంటైల్‌లో ఉండాలన్న నిబంధనను ఎత్తివేశారు. హెచ్‌ఆర్డీ తాజా నిర్ణయంతో పలువురు విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. పూర్తి వివరాలు http://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 

Tags:    

Similar News