Govt Jobs: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 327 పోస్టులు.. నెలకు రూ. 1.77 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలు మీకోసం..!

Govt Jobs: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలు ఫ్లయింగ్, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఎంట్రీ, ఇతర విభాగాలలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ https://afcat.cdac.in/AFCAT/ సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Update: 2023-11-20 08:30 GMT

Govt Jobs: ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో 327 పోస్టులు.. నెలకు రూ. 1.77 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలు మీకోసం..!

Govt Jobs: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలు ఫ్లయింగ్, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఎంట్రీ, ఇతర విభాగాలలో ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ https://afcat.cdac.in/AFCAT/ సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .

అర్హతలు..

AFCAT 2024లో పాల్గొనడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అయితే, వివిధ పోస్టులకు అర్హత భిన్నంగా ఉంటుంది. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చూడవచ్చు.

ఖాళీల వివరాలు..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 327 (మహిళలు, పురుషులు) పోస్టులను భర్తీ చేస్తారు. పోస్ట్‌ల వారీగా రిక్రూట్‌మెంట్ వివరాలు..

AFCAT (ఫ్లయింగ్): 38 పోస్ట్‌లు

AFCAT గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ AE-L): 125 పోస్టులు

AFCAT గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/ AE-M): 50 పోస్టులు

AFCAT గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్/అడ్మిన్): 50 పోస్టులు

AFCAT గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్/LGS): 13 పోస్టులు

AFCAT గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్/అకౌంట్స్): 13 పోస్ట్‌లు

AFCAT గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్/ఎడ్యుకేషన్): 10 పోస్టులు

AFCAT గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్/వెపన్ సిస్టమ్ WS బ్రాంచ్): 17 పోస్టులు

మెట్రాలజీ ఎంట్రీ: 11 పోస్టులు

NCC స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్): PC కోసం CDSE 10% సీట్లు, SSC కోసం AFCAT ఖాళీలో 10% సీట్లు.

వయస్సు..

AFCAT వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 20 ఏళ్లు మించకూడదు. గరిష్ట వయస్సు 24 ఏళ్లు మించకూడదు. అయితే గ్రౌండ్ డ్యూటీ లేదా టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయస్సు 26 ఏళ్లుగా నిర్ణయించారు. NCC సర్టిఫికేట్ హోల్డర్ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు..

AFCAT ఎంట్రీ పోస్టులకు రుసుము రూ. 250 కాగా, NCC స్పెషల్ & మెట్రాలజీ పోస్టులకు దరఖాస్తుకు ఫీజు లేదు.

జీతం..

ఫ్లయింగ్ ఆఫీసర్ జీతం నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు ఉంటుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి:

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://afcat.cdac.in/AFCAT/ సందర్శించండి .

ఇక్కడ ముందుగా మీరు మీ వివరాలను పూరించాలి.

అప్పుడు అభ్యర్థులు రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందుతారు.

అభ్యర్థులు యూజర్ ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయడం ద్వారా వారి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి.

దీని తర్వాత ఫారమ్‌ను సమర్పించండి. దీని దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.

దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్ https://afcat.cdac.in/AFCAT/ క్లిక్ చేయండి..

Tags:    

Similar News