మిజోరం సీఎంగా జోరంతంగా ప్ర‌మాణం

Update: 2018-12-15 11:45 GMT

మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా మిజో నేషనల్‌ ఫ్రంట్‌ నాయకుడు జొరామ్‌థంగా శనివారం రాజ్ భవన్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జోరంతంగా మీజో భాష‌లోనే ప్రమాణంచేశారు. మిజోరం గవర్నర్ కే. రాజ‌శేఖ‌ర‌న్ జోరంతంగాతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల ముగిసిన మిజోరాం అసెంబ్లీ ఎన్నికలలో 26 సీట్లను గెలుపొందింది. మిజోరంలో మొత్తం 40స్థానాలు ఉండగా 26 సీట్లను గెలుపొందడంతో ఎంఎన్ఎఫ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2008 నుండి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 5 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఎంఎన్ఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ఇది మూడ‌వ సారి. 

Similar News