జగన్ పై దాడి కేసులో నయాట్విస్ట్...వైసీపీ నేతలకు నోటీసులు

Update: 2018-11-04 05:20 GMT

వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ కు పోలీసులు నోటీసు జారీ చేశారు. వై.ఎస్ .జగన్ పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అని ఆరోపించడంపై ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈనెల 6న విచారణ కోసం గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పోలీసులు నోటీసులో కోరారు. అధికారాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష నేతలను పోలీసు కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జోగి రమేష్ అన్నారు. జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త అని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని... ఆ విషయాన్నే ప్రస్తావించానని  వైసీపీ నేత జోగి రమేష్ స్పష్టం చేశారు. దాడి తర్వాత చంద్రబాబు, డీజీపీలు శ్రీనివాస్ వైసీపీ కార్యకర్త అని వ్యాఖ్యలు చేశారని అన్నారు. మరి వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు జోగి రమేష్. 

Similar News