దినేశ్ కార్తీక్‌, హార్దిక్ పాండ్యా లకు గుడ్ న్యూస్ చెప్పిన ఐసీసీ

Update: 2018-05-04 05:20 GMT

భారత క్రికెటర్లు క్రికెటర్లు దినేశ్ కార్తీక్‌, హార్దిక్ పాండ్యా లకు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తుపాను కారణంగా దెబ్బతిన్న అంగ్విల్లాలోని రొనాల్డ్ వెబ్‌స్టర్ పార్క్, డొమినికాలోని విండ్‌సోర్ పార్క్, బ్రిటిష్ వర్జిన్ ఐలండ్స్‌లోని ఏవో షిర్లీ రిక్రియేషన్ గ్రౌండ్, సెయింట్ మార్టెన్‌లోని కరీబ్ లుంబెర్ బాల్ పార్క్‌లను తిరిగి నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది ఐసీసీ. ఇందులో భాగంగా  విండీస్ తో ఐసీసీ ఎలెవన్ జట్టు t20 మ్యాచ్ ఆడనుంది. లార్డ్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు ఆసియా ఖండం నుంచి తాజా మాజీ క్రికెటర్లను ఎంపిక చేసింది. అందులో భారత్ నుంచి దినేశ్ కార్తీక్‌, హార్దిక్ పాండ్యా లకు చోటు లభించగా.. పాకిస్థాన్ నుంచి షాహిద్ ఆఫ్రిది, షోయబ్ మాలిక్ లు ఎంపికయ్యారు. అంతేకాదు బాంగ్లాదేశ్ నుంచి షకీబల్ హసన్ , తమీమ్ ఇక్బాల్.. శ్రీలంక, ఆఫ్ఘానిస్తాన్ నుంచి థిసారా పెరీరా, రషీద్ ఖాన్‌ లు ఒక్కొక్కరుగా ఎంపికయినట్టు  క్రికెటర్లకు సమాచారం అందించింది ఐసీసీ. 

Similar News