ఈ మౌనం వెనక అర్థమేంటి బాబూ?

Update: 2018-04-29 18:07 GMT

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. టీడీపీని, సీఎం బాబును, మంత్రి లోకేష్ ను ఓ రేంజ్ లో ఆరోపణలతో ఆడుకుంటున్నారు. కానీ.. అంతకు తగిన విధంగా.. చంద్రబాబు నుంచి లోకేష్ నుంచి ఆఖరికిట టీడీపీ నేతల నుంచి కూడా ప్రతిస్పందన రావడం లేదు. వరుసగా ట్వీట్లు చేస్తూ.. ప్రత్యక్షంగా ఓ సారి.. పరోక్షంగా మరోసారి కామెంట్లు చేస్తున్న పవన్ విషయంలో.. ఇంకా మౌనవ్రతాన్నే కొనసాగిస్తున్నారు.. చంద్రబాబు, లోకేష్.

ఇలా ఎందుకు చేస్తున్నారో తమకు అర్థం కావడం లేదంటూ.. టీడీపీ కేడర్ కూడా ఆందోళన చెందుతోంది. ఓ వైపు.. పవన్ అంతగా రెచ్చిపోతుంటే.. జగన్ ను ఒక్క మాట కూడా అనకుండా టీడీపీనే విమర్శిస్తుంటే.. ప్రధాని మీద బాలయ్య కామెంట్లను బహిరంగంగా తప్పుబడుతుంటే.. టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టుగా అధినేతకు కనిపించడం లేదా.. అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.

ఈ పరిస్థితి.. ప్రతిపక్ష వైసీపీకి, బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే.. పవన్ కల్యాణ్ చేసే ఆరోపణలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో ఒక విధంగా వివరణ ఇచ్చి ఉంటే బాగుండేదని.. ఇలా మౌనంగా ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని.. తమ్ముళ్లు ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే గొణుక్కుంటున్నారు.

ఈ పరిస్థితిపై.. చంద్రబాబు అండ్ లోకేష్.. ఎలా స్పందిస్తారో చూడాల్సిందే మరి.

Similar News