కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు సెహ్వాగ్ గుడ్ బై..

Update: 2018-11-04 03:14 GMT

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వచ్చే సీజన్‌లో తాను కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా వ్యవహరించడం లేదని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రకటించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ జట్టుతో తన కాంట్రాక్టు రద్దు చేసుకున్నట్లు సెహ్వాగ్ తెలిపాడు. 2014, 2015లలో కింగ్స్‌ ఎలెవన్‌ జట్టుతరఫున ఆడిన సెహ్వాగ్‌ ఆ తర్వాత మూడు సీజన్‌లుగా మెంటార్‌ పాత్ర పోషించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు మెంటార్‌ గా వీరేంద్ర సెహ్వాగ్ సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ ఏడాది సీజన్ లో రాజస్థాన్ రాయల్స్‌తో..కింగ్స్ పంజాబ్ జట్టు ఆడిన గత మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలం కావడంతో పంజాబ్ జట్టు కో ఓనర్ ప్రీతి జింటా వీరూపై విరుచుకుపడడంతో తీవ్ర మనస్తాపంతో సెహ్వాగ్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అసమయంలోనే అయన తప్పుకోవాలని నిర్ణయించుకున్నా డెసిషన్ మాత్రం తీసుకోలేదు. తాజాగా సెహ్వాగ్ తీసుకున్న నిర్ణయం పలువురిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Similar News