అరుదైన దృశ్యం : మూడు పాముల సయ్యాట

Update: 2018-11-25 14:21 GMT

సాధారణంగా మనం రెండు పాములు పెనవేసుకుని ఉండటాన్ని చూసి ఉంటాం.. కానీ మూడు పాములు ఒకదానికొకటి పెనవేసుకుని నాట్యమాడటం అరుదుగా జరుగుతుంటుంది. మూడు పాములు కలిసి నాట్యమాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఈ 
ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లా పరమకుడి అరసడివండల్ అనే గ్రామ సమీపంలోని పొలంలో వెలుగుచూసింది.  ఇందులో మూడు పాములు ఒకదాని తరువాత మరొకటి వచ్చాయి. ఆ తరువాత మూడు కలిసి పెనవేసుకున్నాయి. అనంతరం గంటకు పైగానే నాట్యమాడుతూ చూపరులకు కనువిందు చేశాయి. ఆ మూడు పాములు కలిసి మెలికలు తిరుగుతూ రెండు మూడు అడుగులు ఎత్తుకు లేచి నాట్యమాడే సయ్యాటను తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు గ్రామస్థులు. ఈ విన్యాసాలు సాదరణమే అయినా మూడు పాములు నాట్యం చేయటంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది. 

Similar News