తెలంగాణ ఎన్నికల్లో ఇద్దరు మంత్రుల ఓటమి

Update: 2018-12-11 07:53 GMT

కారు వేగంగా దూసుకుపోతున్నా..కొన్నిచోట్ల దెబ్బతగులుతోంది. ఈ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి  పోటీ చేసిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ నేత, ప్రజాకూటమి (మహాకూటమి) అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఓటమి చవిచూశారు. మరోవైపు తెలంగాణ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ లో ఘోర పరాజయాన్ని మూటకట్టున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి విజయదుందుభి మోగించారు. 
 

Similar News