బీజేపీ పార్టీ ఆఫీస్‌లో కిషన్ రెడ్డికి అవమానం..?

Update: 2017-12-21 10:15 GMT

ఆపార్టీలో ఆయన సీనియర్ నేత అందరికంటే ఎక్కువ ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఇటీవల ఆయన ఆపార్టీ అద్యక్షపదవి నుంచి తప్పుకొని మరో పదవిని నిర్వహిస్తున్నారు. ఆయనకే పార్టీ కార్యలయంలో అవమానం ఎదురవుతోంది. పార్టీ కార్యలయానికి వచ్చినా పార్టీ కార్యలయంలో ఆఫీస్ లేకపోవడంతో ఎక్కడ కూర్చొవాలో తెలియక ఖాళీ ఆఫీస్ రూంల కోసం వెతుకుతున్నారట. 

ఆయనే తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషర్ రెడ్డి. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అందరికంటే ఎక్కవ కాలం దాదాపు ఆరేళ్లు అధ్యక్ష భాద్యతలు నిర్వహించిరు. గత రెండేళ్ల  క్రితం ఆయన అధ్యక్ష భాద్యతలు వదిలి ప్రస్తుతం ఫ్లోర్ లీడర్ భాద్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన హాయంలోనే రాష్ట్ర పార్టీ కార్యలయం సుందరీకణ కోసం దాదాపు జాతీయాపార్టీ ఆరుకోట్ల కేటాయించింది. కానీ ప్రస్తత అధ్యక్షుడు లక్ష్మన్ భాత్యలు తీసుకున్న తరువాత పార్టీ కార్యలయం రెనెవెషన్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెండు, మూడో , నాలుగో అంతస్థులు ట్రిస్టార్ హోటల్ తలపించే స్థాయిలో పార్టీ కార్యలయాన్ని తీర్చి దిద్దారు.  రెండో అంతస్థులో పార్టీ అద్యక్షుడు ఆయన టీం కూర్చొవడానికి ప్రధాన కార్యదర్శులకు కార్యదర్శులకు ప్రత్యేక రూంలు కేటాయించి పార్టీ ఫ్లోర్ లీడర్ కు ప్రత్యేక రూం కేటాయించలేదు. దీంతో పార్టీ కార్యలయానికి కిషన్ రెడ్డి వస్తే కూర్చొవడానికి కోసం ఆయన అనేక అవస్థలు పడుతున్నారట. దీంతో ఆయన వర్గం పార్టీ తీరుపై గుర్రుగా ఉంది.

రెండు అంతస్థుల్లో పార్టీ కార్యలయాన్ని ట్రిస్టార్ హోటల్ వలే తీర్చి దిద్దినా పార్టీలో ముఖ్యపదవుల్లో ఉన్న నేతలకు ప్రత్యేక రూంలు కేటాయించకపోవడం వల్ల పార్టీలో కొత్త చర్చ ప్రారంభమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేక రూంలు కేటాయించి ఫ్లోర్ లీడర్ కు రూం కేటాయించకపోవడంతో కిషన్ రెడ్డి పార్టీ కార్యలయానికి వచ్చి కాన్ఫిరెన్స్ రూంలో కూర్చొని ఆయన కోసం వచ్చిన వారికి కలువాల్సి వచ్చిందని కిషన్ రెడ్డి తన సన్నిహితులు వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. అందిరికి కేటాయించినప్పుడే ఫార్టీ కార్యలయంలో ఫ్లోర్ లీడర్ , లేదా మాజి అధ్యక్షుల కోసం ప్రత్యేక రూం కేటాయిస్తారని అందరూ భావించారట. అదీ కేటాయింకపోవడంతో చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి పార్టీ కార్యలయానికి రాకుండా తన ఎమ్మెల్యే ఆఫీస్ వద్దే కార్యకర్తలను కలువాల్సి వస్తుందిన పార్టీ నేతల వద్ద చెప్పుకున్నట్లు పార్టీలో చర్చ.

మాజి అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి  వచ్చే కార్యకర్తలను కలువడానికి పార్టీ కార్యలయంలో కూర్చొవడానికి రూంలేక అనేక అవమానాలకు గురవుతున్నట్లు ఆయన మద్దతు దారులు చెప్పుకుంటున్నారు. కావాలనే లక్ష్మన్ రూంలు కేటాయించకుండా అవమానిస్తున్నారని కొందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

Similar News