తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు...అభ్యర్ధులను ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌...?

Update: 2018-08-24 08:47 GMT

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌కు వేర్వేరుగా ఎన్నికలు జరపాలని భావిస్తున్నారు.  ఈ వాదనను మంత్రులతో పాటు సీనియర్లు కూడా  సమర్ధిస్తున్నట్టు సమాచారం.  ప్రస్తుతానికి రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉంది ఇదే సమయంలో బీజేపీపై జాతీయ స్ధాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోందని  కేసీఆర్ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో  ఏకకాలంలో రెండు ఎన్నికలు జరిగితే ఆ ప్రభావం ఎమ్మెల్యే ఎన్నికలపై పడుతుందని నిర్ధారణకు వచ్చిన  కేసీఆర్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడమే మంచిదని నిర్ణయించుకున్నారు. షెడ్యూల్ ప్రకారమయితే  వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ లలో ఎన్నికలు జరుగుతాయి. ఈ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సమస్యలతో పాటు పంటల గిట్టుబాటు ధరలు, కరెంటు కోతలు వంటి అంశాలు తెరపైకి వచ్చే సూచనలున్నాయి. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు సిద్ధమని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. 

ముందస్తు ఎన్నికలపై మూడు నెలల ముందు నుంచే కార్యాచరణ సిద్ధం చేసిన సీఎం కేసీఆర్‌ అభ్యర్ధులను కూడా ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పార్టీ తరపున గెలిచిన అభ్యర్యులతో పాటు వివిధ పార్టీల నుంచి చేరిన వారిని కలిపితే టీఆర్ఎస్‌కు 90 మంది సంఖ్యా బలం ఉంది. వీరిలో కొంత మందిపై తీవ్ర వ్యతిరేకత ఉందని  పలు సార్లు కేసీఆర్‌ స్వయంగా హెచ్చరించారు. ఇలాంటి స్ధానాల్లో మినహా మిగిలిన చోట్ల పాత అభ్యర్ధులనే కొనసాగించనున్నట్టు సమాచారం. 

Similar News