అనంతపురంలో విషాదం.. ఆరుగురి ఊపిరి తీసిన విషవాయువు

Update: 2018-07-13 01:44 GMT

అనంతపురం జిల్లాలో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాడిపత్రిలోని గరుడ స్టీల్‌ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా విషవాయువులు ఎగజిమ్మాయి దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.   
400 చదరపు అడుగుల గదిలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా కార్బన్‌ మోనాక్సైడ్‌ విడుదలవడంతో ఈ విషాదం జరిగింది. మొదట ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. వారిని కాపాడేందుకు వెళ్ళీ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు... ఫ్యాక్టరీ గదిలో మొత్తం పదిమంది పని చేస్తుండగా కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చిన రంగనాథ్‌, మనోజ్‌, లింగయ్య, గంగాధర్‌, వసీమ్‌, గురవయ్య అక్కడికక్కడే మృతి చెందారు... మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం వారి  పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా ఈ ఘటనపై హోమ్ మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అలాగే  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.

Similar News