రేవంత్‌తో పాటు కొండల్ రెడ్డి, అయన భార్య వాణికి కూడా నోటీసులు

Update: 2018-09-28 02:25 GMT

 కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఐటి అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రేవంత్‌రెడ్డి, ఆయన భార్య గీత, కుమార్తె నైమిషారెడ్డి పేరుతో ఉన్న ఆస్తులకు సంబంధించి ఆదాయపన్ను శాఖ పూర్తిస్థాయిలో వివరాలు సేకరించింది. వారి బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున జమ అవుతున్న నగదుతోపాటు విదేశాల నుంచి నగదు తరలించినట్లు వచ్చిన ఫిర్యాదులపైనా విచారించింది. ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి నివాసంలోనూ ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. కొండల్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి వాణికి నోటీసులు జారీ చేశారు. పలు అంశాలపై రేవంత్‌ను అధికారులు ప్రశ్నించనున్నారు. రేవంత్‌ రెడ్డిపై ఫెమా, మనీ లాండరింగ్‌ చట్టాల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయి. హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు తరలించాలరని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2014 ఫిబ్రవరి 25 న రఘువరన్‌ మురళి బ్యాంక్‌ నుంచి ఒకేరోజున 9 కోట్ల రూపాయలు రేవంత్‌ అకౌంట్లో జమ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

Similar News