జగన్ పాదయాత్ర అప్పటివరకు వాయిదా..

Update: 2018-11-03 03:21 GMT

వైసీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. వాస్తవానికి విశాఖలో  హత్యాయత్నం అనంతరం ఇవాళ(అక్టోబర్ 3)న పునప్రారంభం కావాల్సి ఉంది. అయితే డాక్టర్ల సూచన మేరకు జగన్ తన పాదయాత్రను మరో వారంరోజులు వాయిదా వేసుకున్నారు. భుజానికి అయిన గాయం ఇంకా పూర్తిగా మానకపోవడంతో వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో గత నెల 25న జగన్‌పై కత్తితో హత్యాయత్నం జరిగిన సమయంలో భుజానికి గాయం అయింది. అనంతరం ఆయనకు హైదరాబాద్ లోని వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అప్పటినుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శుక్రవారం సిటీ న్యూరో సెంటర్‌ వైద్యుల బృందం ఆయనను పరీక్షించింది. భుజం గాయం ఇంకా మానలేదని వారు జగన్ కు చెబుతూ.. ఇంకా మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. పరీక్షల అనంతరం డాక్టర్‌ సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. 3.5 సెంటీమీటర్ల లోతైన గాయం కనుక జగన్‌ భుజానికి శస్త్రచికిత్స చేసినపుడు కండరంలో కొంత భాగాన్ని తొలగించామని.. ఈ సమయంలో జగన్ పాదయాత్రకు వెళ్లి ప్రజలకు అభివాదం చేసే గాయం తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అందువల్ల కొంతకాలం విశ్రాంతి అవసరమని జగన్ కు సూచించినట్టు డాక్టర్ సాంబశివారెడ్డి వెల్లడించారు. 

Similar News