48 గంటల డెడ్ లైన్... చంద్రబాబు దిగిరాకుంటే నిరాహారదీక్ష!

Update: 2018-05-23 08:04 GMT

శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న ఏడు మండలాల్లో వెంటనే ప్రజలందరికీ రక్షిత మంచినీటిని అందించాలని, వెంటనే వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కొత్త మంత్రిని పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి తాను 48 గంటల గడువును ఇస్తున్నానని, ఈలోగా చంద్రబాబు దిగొచ్చి, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపకపోతే నిరాహారదీక్ష చేస్తానన్నారు. 48 గంటల్లో సీఎం చంద్రబాబు సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తాను చేపట్టిన పోరాట యాత్ర ఆపి ఒక్కరోజు నిరాహారదీక్షకు దిగుతానని స్పష్టం చేశారు జనసేనాని పవన్.

Similar News