ఎవరి రాజధాని అమరావతి

Update: 2018-04-06 03:13 GMT

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి అనే బుక్ ను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆవిష్క‌రించారు. ఈ పుస్తకానికి వ్యతిరేకంగా రాజధాని రైతులు, శిరివరపు శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రజా రాజధానిపై కుట్ర పేరుతో మరో పుస్తకావిష్కరణ జరిగింది. 
ఎవరి రాజధాని అమరావతి పేరుతో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పుస్తకాన్ని రాశారు. రాజధాని నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి,. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన పద్దతులేమిటి, ఏపీ రాష్ట్రంలో ఏ రకమైన పద్దతులను అవలంభించారనే విషయాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. అయితే ఈ పుస్తకావిష్కరణ సభకు అన్ని పార్టీలను ఐవైఆర్ కృష్ణారావు ఆహ్వనించారు. టీడీపీకి కూడ ఆహ్వనం పంపారు. 
 ప్రజా రాజధానిపై కుట్ర పుస్తకాన్ని వర్ల రామయ్య ఆవిష్కరించారు. రాజధాని రైతులు, శిరివరపు శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రెండు ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
 మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి పుస్తకాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐవైఆర్ కృష్ణారావు, సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ, సీనియర్ రాజకీయవేత్త వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  మరో వైపు రాజధానిపై కుట్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన టిడిపి నేత వర్ల రామయ్య మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుపై విమర్శలు గుప్పించారు. ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలోనే ల్యాండ్ పూలింగ్ జరిగిందని వర్ల రామయ్య గుర్తు చేశారు.
 

Similar News