ప్రచారానికి రాకుంటే పాతిక లక్షలు...ఎన్నికల వేళ ఆడియో టేపులు కలకలం

Update: 2018-11-21 05:05 GMT

ఎన్నికల వేళ ఆడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, ఎం.ఐ.ఎం నేతల మధ్య సాగిన ఫోన్ సంభాషణలు హాట్ టాపిక్ గా మారాయి. నిర్మల్ లో  ఎం.ఐ.ఎం సభ జరుగకుండా ఉండేందుకు కాంగ్రెస్ 25 లక్షలు ఆఫర్ చేసినట్లు ఆడియో టేపుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని అసదుద్దీన్ సభలో బహిరంగ పరిచారు.  

నామినేషన్లు ముగిసి ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ రాజకీయ దుమారం రేగుతోంది. ఒక పార్టీపై మరో పార్టీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. సోమవారం నిర్మల్ లో ఎం.ఐ.ఎం. బహిరంగ సభ నిర్వహించింది. అయితే ఈ సభకు ముఖ్యఅతిథిగా ఎం.ఐ.ఎం. అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. తనను  సభకు రాకుండా చూడాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని అసద్ ఆరోపించారు. తాను  సభకు రాకుండా ఉంటే 25 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని ఆరోపించారు. తన వద్ద ఫోన్ రికార్డులు ఉన్నాయని చెప్పారు. 

నిర్మల్  లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన‌ అరోపణలను డిసీసీ అధ్యక్షుడు, నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి  మహెశ్వర్ రెడ్డి ఖండించారు. అసద్ కు నిర్మల్ ఎన్నికల ప్రచారానికి రావద్దని ఇరవై ఐదు లక్షల రూపాయల ఆఫర్ ఇస్తామని అసదుద్దీన్ చేసిన‌ వ్యాఖ్యల పై  మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఆఫర్ చేసినట్లు ఆధారాలు బయట పెట్టాలని సవాల్ చేశారు‌. ఆరోపణలు నిజమైతే ఎన్నికల నుండి తప్పుకుని రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. అసదుద్దీన్ సభకు జనం రాకపోవడం వల్ల ఇలాంటి  వ్యాఖ్యలు చేశారని  విమర్శించారు.

ఎం.ఐ.ఎం, కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన ఆడియో టేపులు బయటికి వచ్చాయి. ది. ఇందులో ముధోల్ కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్, బైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ జబీర్ ఆహ్మద్ మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. ఓవైసీ ప్రచారం చేయకుండా డబ్బులు ఇవ్వాలని కాంగ్రెస్ చూసిందని రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నర్సింహరావు అన్నారు. ఆ డబ్బులు ఎక్కడివి ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చిన 500 కోట్లలో భాగమా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఓ వైపు ఎం.ఐ.ఎం. ఆరోపణలు మరోవైపు కాంగ్రెస్ నేతల సవాల్ ఎటువైపు దారి తీస్తుందోనని ఇరు పార్టీల కార్యకర్తల్లో ఉత్కంఠ రేపుతోంది. 
 

Similar News