హైద‌రాబాద్ నగరంలో నేడు బాలయ్య రోడ్ షో...

Update: 2018-12-02 05:50 GMT

తెలుగు సినీమా హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇవాళ కూడా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ ఉదయం 10 గంటలకు వివేకానంద నగర్‌ నుంచి రోడ్‌ షో ప్రారంభిస్తారు. ఆ తర్వాత 10 గంటలా 30 నిముషాలకు భాష్యం స్కూల్‌ అపార్ట్‌మెంట్స్‌లో రోడ్‌ షోతో పాటు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ఉషా ముల్లపూడి, భాగ్యనగర్‌, అడ్డగుట్ట, హెచ్‌ఎంటీ హిల్స్‌, నిజాంపేట్‌, జేపీ నగర్‌ కాలనీల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు రోడ్ షో చేపడతారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎం ఏ నగర్‌, పీజేఆర్ ఎంక్లేవ్‌, హుడా కాలనీ, చర్చ్ రోడ్‌, చందానగర్ మేయిన్ రోడ్, లింగంపల్లి వరకు రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో.. హఫీజ్‌పేట్‌ లో మీటింగ్ నిర్వహిస్తారు. అలాగే రాత్రి 10 గంటల సమయంలో చివరగా కావూరి హిల్స్‌లో రోడ్‌ షో నిర్వహిస్తారు. 

Similar News