రెచ్చిపోయిన కమలదళం..కమ్యూనిస్టు కోటను గెలవడంతో బీజేపీ కార్యకర్తల వీరంగం

Update: 2018-03-06 07:40 GMT

కమ్యూనిస్టుల కోట త్రిపురలో కాషాయం జెండా ఎగరడంతో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడకముందే కాషాయదళం తరహా పాలన మొదలైంది. అగర్తలలో బీజేపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. బెలోనియా కాలేజ్‌లో ఉన్న వామపక్ష సిద్ధంతకర్త వ్లాదిమిర్ లెనిన్ విగ్రహాన్ని కూల్చివేశారు. బుల్డోజర్‌ను తీసుకొచ్చి  కూలగొట్టారు. మాణిక్ సర్కారు సీఎం పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఇది జరగడం గమనార్హం. 

అంతేకాదు..పక్కనే ఉన్న లెఫ్ట్ పార్టీల కార్యాలయంపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ విధ్వంసం సృష్టించారు. అక్కడ దొరికిన వామపక్ష జెంగాలు, పుస్తకాలను తగులబెట్టి.. ఫర్నిచర్‌ను విరగ్గట్టారు. అగర్తలలో లెనిన్ విగ్రహం కూల్చివేత తీవ్ర సంచలనంగా మారింది. బీజేపీ కార్యకర్తలు తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. లెనిన్ విగ్రహం కూల్చివేతపై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.  

Similar News