ఏపీలో టీడీపీ లీక్స్

Update: 2018-02-15 18:10 GMT


   కేంద్రానికి ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ త‌న ఎంపీల‌ను ఏప్రిల్ 6న రాజీనామా చేయిస్తాన‌ని డెడ్ లైన్ పెట్టారు. కేంద్ర బ‌డ్జెట్ లో అన్యాయం జ‌రిగింద‌ని, ప్ర‌త్యేక ప్యాకేజీ కావాల‌ని డిమాండ్ చేస్తున్న జ‌గ‌న్ కేంద్ర ప్ర‌భుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఒక వేళ కేంద్రం కాదు -  కూడ‌దు అంటే త‌న పార్టీ కి చెందిన ఎంపీల‌తో రాజీనామా చేయించి పోరాటం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. 
జ‌గ‌న్ డెడ్ లైన్ తో ఇర‌కాటంలో ప‌డ్డ టీడీపీ అదే త‌రహ ప్ర‌క‌ట‌న చేసి వెన‌క్కి తీసుకుంది. క‌డ‌ప జిల్లాల్లో ఓ కార్య‌క్ర‌మానికి హ‌జ‌రైన మంత్రి నారాయ‌ణ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అంతలోనే త‌న మాట‌లు వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని తేల్చిచెప్పారు.  
మార్చి 5వ తేదీ వ‌ర‌కు కేంద్రప్ర‌భుత్వం రాష్ట్రం గురించి ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఇవ్వాల‌ని కోరారు. లేదంటే త‌న పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేసి మిత్ర బంధాన్ని తెంచుకుంటామ‌ని అన్నారు. ఓవైపు మంత్రి నారాయణ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డంతో..ఆ వ్యాఖ్య‌ల‌న్నీ సోష‌ల్ మీడియాలో దావ‌నంలో చుట్టుముట్టాయి. అంతే ఉన్న‌ట్లుండి ఏమైందో తెలియ‌దు కానీ ..ప్ర‌క‌టించిన గంట‌లోపే ఈ వ్యాఖ్య‌లు త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మ‌ని, పార్టీతో సంబంధం లేదంటూ చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. 
ఇదిలా ఉంటే పార్టీ అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకున్నా ..వాటిని బ‌హిర్గ‌తం చేసి మైలేజ్ పొందాల‌ని మంత్రి భావించి ఉంటార‌ని రాజకీయ విశ్లేష‌కులు చెప్పుకుంటున్నారు.  ఒక్కోసారి ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం వ‌ల్ల వ్య‌క్తిగ‌త జీవితానికి, రాజీకియ జీవితానికి ఇబ్బందులు తెలెత్తే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. 

Similar News