బీజేపీ బ్రేకప్‌.. సీఎం రాజీనామా!

Update: 2018-06-19 10:28 GMT

జమ్ముకశ్మీర్ రాష్ట్ర రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఆమె మంత్రివర్గ సహచరులు తన పదవులకు రాజీనామా చేశారు. ఆమె రాజీనామా నిర్ణయాన్ని పీడీపీ వర్గాలు ధ్రువీకరించాయి. కాసేపటి క్రితమే... పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ)తో ఉన్న సంకీర్ణ బంధాన్ని బీజేపీ తెగతెంపులు చేసుకుంది. ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగుతున్నట్టు ఆ పార్టీ ప్రతినిధి రామ్ మాధవ్ ప్రకటించడంతో జమ్మూకశ్మీర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ నిర్ణయంతో మూడేళ్ల సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడింది. దీంతో సంఖ్యాబలం కోల్పోయిన ముఫ్తీ తన రాజీనామాను గవర్నర్‌ ఎన్.ఎన్.వోహ్రాకు పంపినట్టు తెలిసింది. పరిస్థితిని సమీక్షిచేందుకు మెహబూబా ముఫ్తీ తన నివాసంలో 4 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడంతో పీడీపీ నేతలంతా అక్కడికి చేరుకుంటున్నారు. మరోవైపు, బీజేపీ మంత్రులంతా తమ రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించారు.
 

Similar News