మేడారం జాతరలో ఏరులై పారిన మద్యం

Update: 2018-02-05 06:11 GMT

నాలుగు రోజుల జాతర 50 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు 50కోట్ల అమ్మకాలంటే ఎవరైనా నమ్ముతారా ? నమ్మి తీరాల్సిందే. నాలుగు రోజుల పాటు జరిగిన మేడారం జాతర సందర్భంగా మద్యం ఏరులై పారింది. ఒక రోజులో జంట నగరాల్లో కూడా ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు జరగవు. ఒక్క న్యూ ఇయర్‌ వేడుకల సమయంలో మాత్రమే వంద కోట్ల రూపాయలకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. 

మేడారం జాతరలో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు విధించలేదు. దీంతో ఎవరికి ఇష్టమొచ్చినట్లు వారు మద్యాన్ని మేడారం పరిసర ప్రాంతాల్లో మద్యాన్ని ఏరులై పారించారు. మద్యం వద్దంటూ ప్రచారం చేయాల్సిన సర్కార్‌ ఇష్టమొచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ బార్లకు అనుమతిచ్చింది. ఆదాయం కోసం ప్రభుత్వమే మద్యం అమ్మకాలను ప్రొత్సహిస్తోంది. 

22 తాత్కాలిక బార్‌లకు అనుమతిస్తే వారం రోజుల్లోనే నాలుగుకోట్ల రూపాయల మద్యాన్ని విక్రయించారని తేలింది. జాతరలోనే కాకుండా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో మద్యం విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వతేదీ వరకు కేవలం నాలుగురోజుల్లేనే 50 కోట్ల రూపాయలు మద్యం అమ్ముడైంది.

Similar News