చెప్పింది గోరంత..బయట పడుతోంది కొండంత: రామారావు

Update: 2018-09-28 07:12 GMT

రేవంత్ రెడ్డి సంస్ధలపై రెండు నెలల పాటు సమాచారం సేకరించాకే .. దర్యాప్తు సంస్ధలను ఆశ్రయించినట్టు న్యాయవాది రామారావు తెలిపారు. దర్యాప్తు సంస్ధల విచారణ నుంచి తప్పించుకునేందుకు రాజకీయ కుట్రలంటూ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదులో తాను చెప్పిన దాని కంటే ఎక్కువ మొత్తంలోనే అక్రమాలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. పన్నులు కట్టకుండా తప్పించుకునేందుకు 19 డొల్లకంపెనీలు ఏర్పాటు చేసి నిధులు మళ్లించారన్నారు. ఈ వ్యవహారంలో 15 రోజుల ముందే రేవంత్‌కు ఐటీ నోటీసులు అందాయని న్యాయవాది రామారావు తెలిపారు.

Similar News