చంద్ర‌బాబు ఉండ‌గా..పొలిటిక‌ల్ జేఏసీ ఎందుకు దండ‌గా

Update: 2018-02-12 02:59 GMT

ఏపీ సీఎం చంద్రబాబు ఉండగా జేఏసీ ఎందుకు అంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు..ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి..ఏపీ కి ప్రత్యేక హోదా ఏర్పాటు కై జేఏసీ ఏర్పాటు చేయాలని యోచించిన పవన్ కళ్యాణ్ కి ఆదిలోనే ప్రశ్నలు మొదలయ్యాయి..ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో జెఎసిని ఏర్పాటు చేయాలని జనసేన పవన్ నిర్ణయించుకున్న విషయం అందరికీ తెలిసిందే.జేఏసీలో  ఏపీకి కేంద్రం నుండి రావాల్సిన నిధుల విషయమై ఒత్తిడి పెంచేందుకు కార్యాచారణపై చర్చించనున్నారు…అయితే ఏపీ కి చంద్రబాబు సీఎం గా ఉండగా ఏపీ హక్కుల విషయంలో ,నిధుల విషయంలో, ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రశక్తిలేదని తెలిపారు.. ఏపీ హక్కుల కోసం ప్రత్యేకంగా జెఎసిని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు అతి పెద్ద జేఏసీ అని తెలిపారు..ప్రతిపక్షాలు సీఎం కి సపోర్ట్ చేసినా సరిపోతుంది..జేసీగా ఏర్పడవలసిన అవసరం లేదని తెలిపారు..
బీజేపి ఉత్తి మాటలు చెప్తే ఊరుకోమని..మాటలు చెప్పి నిధులు ఇవ్వకుంటే ఎలా కుదురుతుందని అన్నారు..ఒక వేళ కేంద్రం ఇచ్చిన హామీలని నిలబెట్టుకోకపోతే మార్చి 5వ, తేది నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలను స్థంభింపజేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు..అన్ని జాతీయ పార్టీలు బీజేపి ఏపీకి చేస్తున్న అన్యాయాన్ని విమర్సిస్తున్నాయని తెలిపారు…అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ ,ఉండవల్లి భేటీ జరుగనున్న నేపధ్యంలో నానీ ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతో చర్చనీయాంశం అయ్యింది..మరి నానీ వ్యాఖ్యలపై ఉండవల్లి కానీ ,పవన్ కళ్యాణ్ కానీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Similar News