కేసీఆర్ ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఖారారు...కేసీఆర్తో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న ఐదుగురు మంత్రులు
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఒకటిన్నరకు రెండోసారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారు. కేసీఆర్ జాతక రీత్యా పండితులు ముహూర్తం ఖరారు చేశారు. రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. కేసీఆర్తో పాటు ఐదుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. ఇక ఇవాళ తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ఎల్పీ నాయకుడిని ఎన్నుకోనున్నారు. సమావేశానికి టీఆర్ఎస్ తరపున గెలిచిన అభ్యర్థులందరూ హాజరు కానున్నారు.