హెల్త్ బులిటెన్‌లో విషాద వార్త...కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై తేల్చి చెప్పిన ఆసుపత్రి యాజమాన్యం

Update: 2018-08-07 11:43 GMT

కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించింది.  అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది. 24 గంటలు గడిస్తేగానీ ఏం చెప్పలేమంటూ వైద్యులు ప్రకటించటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కార్యకర్తల రోదనలతో కావేరీ ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ఆస్పత్రి వద్ద పోలీసులతో ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే, రాష్ట్ర డీజీపీ రాజేంద్రన్ కూడా సెలవుల్లో ఉన్న పోలీసులంతా తక్షణమే విధులకు హాజరుకావాలని సర్క్యులర్ జారీ చేశారు.
 
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో భద్రతను పెంచాలని పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కరుణానిధికి చికిత్సనందిస్తున్న కావేరి ఆసుపత్రి కూడా కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత కొద్ది గంటలుగా ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించిందని, సాధ్యమైనంత వరకూ వైద్య చికిత్సనందిస్తున్నామని కానీ ఆయన అవయవాలు చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు హెల్త్ బులిటెన్‌లో స్పష్టం చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, ఏ మాత్రం నిలకడగా లేదని వైద్య బృందం తేల్చి చెప్పింది.

 

Similar News