ఇదేం రాజకీయమప్పా

Update: 2017-12-20 11:39 GMT

అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత.... గతేడాది సెప్టెంబర్‌ 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు నెలలకు పైగా ఆస్పత్రిలోనే ఉన్న జయ.... చికిత్స పొందుతూ గతేడాది డిసెంబర్‌ 5న తుదిశ్వాస విడిచారు. అయితే జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో.... ఆమె నెచ్చెలి శశికళ ఎవరినీ కలవనివ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. దాంతో అమ్మ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పన్నీర్‌ వర్గం ఆరోపించింది. అంతేకాదు జయను ఆస్పత్రిలో చేర్చేనాటికే జయలలిత మరణించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను శశికళ వర్గం ఖండిస్తూ వచ్చింది. ఆస్పత్రిలో అమ్మ బతికే ఉందని చెప్పేందుకు తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని దినకరన్‌ చెప్పుకొచ్చారు. అవసరమైనప్పుడు ఆ వీడియోలు రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. అయితే జయలలిత మరణించిన ఏడాది తర్వాత.... ఆర్కేనగర్‌ ఉపఎన్నికకు సరిగ్గా ఒక్కరోజు ముందు ఆ జయలలిత ఆస్పత్రి దృశ్యాలను బయటపెట్టి సంచనాలకు తెరతీశారు. 

Similar News