తెలిసీ తెలియకుండా మాట్లాడకూడదని వెళ్ళిపోయా : జగన్

Update: 2018-11-17 13:13 GMT

గతనెల 25న విశాఖ ఎయిర్పోర్టులో ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇన్ని రోజులు ఈ దాడి గురించి వైసీపీలోని ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. తాజగా పాదయాత్రలో భాగంగా పార్వతీపురం బహిరంగసభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్బంగా తనపై జరిగిన దాడి విషయంపై మొదటిసారి స్పందించారాయన.. విశాఖ ఎయిర్పోర్టులో తనపై హత్యా యత్నం జరిగింది. ఈ దాడిని నేనే చేయించుకున్నానని, దాడి చేసిన వ్యక్తి(శ్రీనివాసరావు) వైసీపీకి చెందిన వ్యక్తేనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనడం బాధేసిందని అన్నారు. వైసీపీకి సింపతీ కోసమే ఆ వ్యక్తి తనపై దాడి చేశాడని అతను చెప్పినట్టు మంత్రులు అనడం కుట్రే అన్నారు. తనపై దాడి జరిగిన తరువాత రక్తంతో తడిసిన చొక్కాను మార్చుకుని ఆ కత్తికి ఏమైనా విషం ఉందేమోనని హైదరాబాద్ లో ఆసుపత్రికి వెళ్లానని.. కానీ ముఖ్యమంత్రి మాత్రం నేను మా ఇంటికి వెళ్లినట్టు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం బాధాకరం అన్నారు. దాడి జరిగిన తరువాత నేను ఏం మాట్లాడకుండా వెళ్లిపోయాను.. ఎవర్ని నిందించలేదు. ఎందుకంటే తెలిసి తెలియకుండా మాట్లాడకూడదన్న ఉద్దేశ్యంతో ఏమి మాట్లాడలేదు అని జగన్ అన్నారు. నాపై దాడి చేసిన వ్యక్తి నా అభిమాని అయితే.. హత్యాయత్నం ఎందుకు చేస్తాడని ప్రశ్నించారు జగన్. 

Similar News