జగన్ సంకల్పానికి 200 రోజులు!

Update: 2018-06-27 02:27 GMT

ప్రభుత్వ పాలనను ఎండగడుతూ, ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు ఇడుపులపాయ వైయస్ఆర్ ఘాట్ నుంచి గతేడాది నవంబర్‌ 6న ప్రారంభమైన జగన్‌ ప్రజాసంకల్పయాత్ర.. ఇవాళ్టితో 200 రోజులు పూర్తి చేసుకోనుంది. 200 రోజుల పాటు 2 వేల 400 కిలోమీటర్లలకు పైగా పాదయాత్ర చేసిన జగన్. ప్రజల కష్టాలు వింటూ, ఆత్మీయంగా పలకరిస్తూ జగన్‌ ముందుకు సాగుతున్నారు. ఇవాళ అమలాపురం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి.. కామనగరువు, అప్పన్నపేట, విలాసవిల్లిల మీదుగా వాసంశెట్టివారి పాలెంకు చేరుకుంటారు. అనంతరం భీమనపల్లి చేరుకుని అక్కడ యాత్ర ముగిస్తారు.

ఇదిలావుంటే 199వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్బంగా చంద్రబాబుకు హాస్టల్‌లో చదువుకుంటున్న పిల్లలపై, నిరుద్యోగులపై, అంగన్‌వాడీ కార్యకర్తలపై ఉన్నట్లువుండి ప్రేమ పుట్టుకొచ్చిందని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో 648 ఎస్సీ హాస్టళ్లు, 201 బీసీ హాస్టళ్లు, ఎస్టీ హాస్టళ్లను మూసేశారని మండిపడ్డారు. 60 వేల మంది పిల్లలు రోడ్డున పడేశారని అన్నారు.

Similar News