ఎస్పీ రాసలీలలు.. భీమాశంకర్‌ కు ఝలక్ ఇచ్చిన ప్రభుత్వం..

Update: 2018-07-17 02:28 GMT

మహిళతో రాసలీలల వీడియోలు బయటపడడంతో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బెంగళూరు రూరల్‌ జిల్లా ఎస్పీ భీమాశంకర్‌ గుళేద్‌ వ్యవహారాన్ని  రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా వేకెన్సీ రిజర్వు కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో టీపీ శివకుమార్‌ను రూరల్‌ ఎస్పీగా నియమించారు. 

ఇదిలావుంటే బెంగళూరు దేవాంగెరె  ప్రాంతానికి చెందని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుకు 2010లో పెళ్లయింది. భార్యాభర్తలు రెండేళ్లపాటు అమెరికాలో ఉండి వచ్చారు. అతడి భార్య గ్రాఫిక్ డిజైనింగ్ స్టూడియో నిర్వహిస్తోంది. గత ఏడాది ఎస్పీ భీమశంకర్‌ గులేద్‌ ఓ ఫోటో షూట్ కోసం ఆమె స్టూడియోకి వెళ్లాడు. అప్పుడే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 

తర్వాత ఇద్దరూ సిటీలో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో ప్రవర్తన మార్చుకోవాలని భార్యను మందలించాడు ఆ టెక్కీ. భర్తకు భయపడి కొన్నాళ్లు ఆ ఎస్పీకి దూరంగా ఉంది. తర్వాత కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇక ఏంచేయాలో అర్థంగాక అతడు పోలీసుకు కంప్లైంట్ చేశాడు.  లిప్‌లాక్ వీడియోల అధారంగా ఈ కేసు తేల్చడానికి స్వయంగా కర్నాటక హోం శాఖ రంగంలోకి దిగింది. 

Similar News