హైదరాబాద్ నగర వ్యాప్తంగా 144 సెక్షన్ ... మద్యం అమ్మకాలపై నిషేధం!

Update: 2018-12-10 10:34 GMT

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తూ సీపీ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నగర వ్యాప్తంగా మద్యం విక్రయాలను నిషేధించారు. వైన్ షాపులు,  బార్లు, రెస్టారెంట్లు, పబ్ లు బంద్ చేయాలని ఆదేశించారు. ఇక ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు జరిపితే కఠిన చర్యలుంటాయని పోలీసు అధికారులు హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చరాదని, పరిమితికి మించి శబ్దం చేసే వారిపైనా చర్యలుంటాయని అన్నారు.

Similar News